లోకేశ్ ట్వీట్

లోకేశ్ ట్వీట్

0

భారత రాజ్యాంగ రచయిత, దళితజనులలో సాంఘిక, రాజకీయ, విద్యా చైతన్యాలను రగిలించిన స్ఫూర్తి ప్రదాత డా.బి.ఆర్.అంబేద్కర్. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని నవభారత నిర్మాతగా, గొప్ప దేశభక్తునిగా, సామాజిక విప్లవకర్తగా ఆ మహనీయుడు చేసిన కృషిని స్మరించుకుందామని లోకేశ్ అన్నారు…

నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావని డా.బి.ఆర్.అంబేద్కర్ అన్న మాటలను గుర్తు చేశారు లోకేశ్.. ఆయన దళితజనుల పట్ల ఉన్న వివక్షను రూపుమాపేందుకు జీవిత కాలం పోరాటం చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. ఆయన చూపించిన మార్గంలో నడవడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని లోకేశ్ అన్నారు..