లవ్ యాక్సెప్ట్ చేయాలంటూ అమ్మాయితో చిల్లర చేష్టలు

0

తన లవ్ ను యాక్సెప్ట్ చేయాలంటూ ఓ యువకుడు ఒక అమ్మాయిని సతాయిస్తున్నాడు. ఆమెపై వత్తిడి తీసుకొచ్చేందుకు గలీజ్ పనులు చేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన ఆ యువతి ఆకతాయిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఒక అమ్మాయి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఒక ఆసుపత్రిలో సీనియర్ ఎగ్జిక్యూటీవ్ గా పనిచేస్తున్నారు. ఆమె ఫోన్ కు అరవింద్ అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఫోన్ చేసి పరిచయం పెంచుకున్నాడు. తాను ప్రేమిస్తున్నానంటూ అరవింద్ చెప్పడంతో ఆ యువతి రిజెక్ట్ చేసింది. దీంతో అతడు పదే పదే ఫోన్ చేసి వేధించడం స్టార్ట్ చేశాడు.

అంతేకాదు మే నెల 31న ఆ అమ్మాయి పనిచేసే ఆసుపత్రి వద్దకు వచ్చి ఆమెకోసం నిరీక్షించాడు. ఆమె ఆసుపత్రికి డ్యూటీకి రాగానే ఆమె చేయి పట్టుకున్నాడు. తన ప్రేమను అంగీకరించాలని ప్రెజర్ చేశాడు. ఆమెతో అసభ్యంగా వ్యవహరించాడు. అదే సమయంలో ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది వారించే ప్రయత్నం చేయగా వారిని బెదిరించాడు.

ఈ ఘటనతో షాక్ కు గురైన ఆ యువతి అప్పటినుంచి డ్యూటీకి రావడం మానేసింది. అయితే ఆసుపత్రి ఉద్యోగుల సహకారంతో ధైర్యం తెచ్చుకుని డ్యూటీకి రావడమే కాదు జరిగిన సంఘటనలపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అరవింద్ కోసం గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here