భార్య ఆత్మహత్య కేసులో టీవీ నటుడు మధు ప్రకాశ్ అరెస్టు

భార్య ఆత్మహత్య కేసులో టీవీ నటుడు మధు ప్రకాశ్ అరెస్టు

0

తెలుగు టీవీ నటుడు మధుప్రకాశ్ భార్య భారతి (34) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధుప్రకాశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. భారతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అతన్ని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. అదనపు వరకట్నం వేధింపుల కేసు కింద మధుప్రకాశ్ ను అరెస్టు చేసినట్టు పోలీసుల సమాచారం.భారతి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికీ పోలీసులు తరలించారు. కాగా, మధుప్రకాశ్ వేధింపులే భారతి ఆత్మహత్యకు కారణమని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.