మ‌హేష్ బాబు సినిమాలో మ‌రో టాప్ హీరో

మ‌హేష్ బాబు సినిమాలో మ‌రో టాప్ హీరో

0

సరిలేరు నీకెవ్వరు ఈ చిత్రం తాజాగా ప్రిన్స్ కు ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.. ఈ సంక్రాంతికి బొమ్మ ద‌ద్ద‌రిల్లిపోయింది, అయితే త‌ర్వాత ప్రాజెక్ట్ విష‌యంలో మాత్రం మ‌హేష్ ఏమీ అనౌన్స్ చేయలేదు, వంశీతో సినిమా వెనక్కి వెళ్లింది.

అయితే ఇక ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ తో సినిమాని ఫైన‌ల్ చేశారు ప్రిన్స్ మ‌హేష్. క‌ధ వ‌ర్క్ అంతా పూర్తి అయింది, ఇక ఈ సినిమాలో నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఫ్యామిలీ-యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ఉపేంద్ర న‌టిస్తారు అని తెలుస్తోంది, అంతేకాదు ఆయ‌న న‌ట‌న ఈ సినిమాకి ప్ల‌స్ అవుతుంది అని అందుకే ఆ పాత్ర‌కి ఆయ‌న బెస్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అయితే ఈ వైర‌స్ ప్ర‌భావం త‌గ్గాక ఉపేంద్ర‌తో చ‌ర్చిస్తార‌ట‌, ఈ సినిమాకి ఆయ‌న ఒకే చెబితే మ‌రో సూప‌ర్ హిట్ ఈ ఏడాది చూడ‌చ్చు అంటున్నారు ప్రిన్స్ అభిమానులు, ఇక గ‌తంలో ఉపేంద్ర స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో చేసిన క్యారెక్ట‌ర్ ఎంత బాగుందో తెలిసిందే.