రామ్ ని నిరాశపరిచిన మహేష్

రామ్ ని నిరాశపరిచిన మహేష్

0

సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఓ నింద ఉంది. ఆయన సక్సెస్ ఉంటేనే ఆదరిస్తారని పూరి బహిరంగంగానే చెప్పేశాడు. శ్రీకాంత్ అడ్డాల, శ్రీను వైట్ల, సుకుమార్ లది ఇదే మాట. కానీ వాళ్లు ఓపెన్ కాలేదు. ఇప్పుడు మరో దర్శకుడు కూడా ఈ లిస్టులో చేరిపోయాడు. గీత గోవిందం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్న పరశురామ్ కు మహేష్ ఆశపెట్టాడు. ఆయన చెప్పిన లైన్ ని ఓకే చేసి పూర్తి కథతో రమ్మన్నాడు. ఇప్పుడు కథ పూర్తయింది. కానీ, మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదట.

ఈ నేపథ్యంలో.. మళ్లీ విజయ్ దేవరకొండతోనే సినిమా ప్లాన్ చేస్తున్నాడని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐతే, ఇందులోనూ నిజంలేదు. ప్రస్తుతం పరుశురామ్ పెద్ద హీరోలకు కథ చెప్పే పనిలో ఉన్నాడని.. తన కథకు ఏ హీరో ఓకే అంటే.. ఆ హీరోతోనే తన తరువాత సినిమా ఉంటుందని సమాచారమ్. మరీ పరశురామ్ ని కరుణించే స్టార్ హీరో ఎవరన్నది చూడాలి.