మహేష్ బాబు -త్రివిక్రమ్ సినిమా వైరలవుతున్న కొత్త టైటిల్ ?

Mahesh Babu - Trivikram movie new title viral

0

ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు.ఇక గీతగోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ స్టోరీ తెరకెక్కుతోంది. ఇందులో ప్రిన్స్ చాలా స్టైలిష్ గా కనిపిస్తారట. ఈ సినిమాలో మహేష్ కు జోడిగా అందాల భామ కీర్తిసురేష్ నటిస్తోంది.

ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో ఆయన సినిమా చేయనున్నారు. ఇక వీరి హ్యాట్రిక్ చిత్రం పై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ మహేష్ బాబుతో ఎలాంటి సినిమాను తెరకెక్కించబోతున్నారు అన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ తీసే సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటున్నారు. అలాగే ఇందులో ప్రిన్స్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు అని టాక్ వినిపిస్తోంది. అతడే పార్థు అనే టైటిల్ ని ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. కాని సినిమా యూనిట్ నుంచి ఓ ప్రకటన వచ్చే వరకూ చూడాల్సిందే అంటున్నారు అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here