మహేష్ కు నో చెప్పేసిన ఫిదా బ్యూటీ సాయిపల్లవి..

మహేష్ కు నో చెప్పేసిన ఫిదా బ్యూటీ సాయిపల్లవి..

0

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో మహేష్ బాబు సరసన వహించేందుకు ఎవరికైనా అదృష్టం ఉండాలని అంటారు… అవకాశం వచ్చిన వారు ఇతర ప్రాజెక్ట్ లను వదులుకుని మహేష్ తో నటిస్తారు హీరోయిన్లు… తమన్నా కాజల్, త్రిష, ఇలియానా, వంటి గ్లామరస్ డాల్ లు సూపర్ స్టార్ తో నటించారు…

ఇటీవలే బాక్సాఫీస్ వద్ద బద్దలు కొట్టిన సరిలేరునీకెవ్వరు చిత్రంలో రష్మిక నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది… అందుకే చాలామంది స్టార్ హీరోలతో నటించేందుకు ట్రైయి చేస్తుంటారు…

ఫిదా సినిమాతో తెలుగులో సాయిపల్లవి క్రేజ్ వచ్చింది… ఈ ముద్దుగుమ్మకు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించే అవకాశం వచ్చిందట.. కానీ ఈ ముద్దుగుమ్మ దాన్ని కాదనుకుని సంచలనానికి తెరలేపింది… దీంతో ఈ ఆఫర్ రష్మికకు చేరిందని టాక్… సాయి పల్లవి ఫస్ట్ నుంచి సినిమాలను సెలక్ట్ చేసుకుంటూ వెల్తోంది… అందుకే సరిలేరు నీకెవ్వరు చిత్రంలో పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదని నో చెప్పినట్లు టాక్..