చిరంజీవి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న మహేష్ !

చిరంజీవి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న మహేష్ !

0

‘సైరా’ గ్రాఫిక్ వర్క్స్ క్వాలిటీ అనుకున్న విధంగా రాలేదు అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో ‘సైరా’ రిలీజ్ వాయిదా వార్తలు కూడ ఊపు అందుకున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు మెగా కాంపౌండ్ ఆలోచనలు ఇప్పుడు సంక్రాంతి సీజన్ పై ఉన్నాయి అంటూ లీకులు వస్తున్నాయి.

అనుకున్న విధంగా అక్టోబర్ 2న ‘సైరా’ ను విడుదల చేయలేకపోతే ఇదే సంవత్సరం మరొక డేట్ కోసం అన్వేషించే కంటే వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కు ‘సైరా’ ను విడుదల చేస్తే కలక్షన్స్ పరంగా రికార్డులతో పాటు ఈమూవీ రైట్స్ ను అత్యంత భారీ మొత్తాలకు అమ్ముకోవచ్చు అన్న ఆలోచనలు లేటెస్ట్ గా చిరంజీవి చరణ్ లకు వచ్చాయి అన్న ప్రచారం జరుగుతోంది. ఈవార్తలే నిజం అయితే సంక్రాంతి సీజన్ సినిమాల షెడ్యూల్ అంతా మారిపోతుంది.

ముఖ్యంగా ఈ వ్యవహారం వల్ల బాగా నష్టపోయేది మహేష్ అని అంటున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీని సంక్రాంతి రేసుకు తీసుకు రావాలని మహేష్ అనీల్ రావిపూడిలు ఈమూవీని చాల వేగంగా పరుగులు తీయిస్తున్నారు. ఇప్పుడు ‘సైరా’ సంక్రాంతి రేసుకు తన స్థానం సెట్ చేసుకుంటే ఆమూవీతో పోటీగా విడుదల అయ్యే సాహసం మహేష్ ఎట్టి పరిస్థితులలోను చేయలేదు.

దీనితో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీని ఫిబ్రవరికి మార్చుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇదే సంక్రాంతి సీజన్ పై దృష్టి పెట్టిన అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మూవీ షెడ్యూల్ కూడ మారిపోయి వారి మూవీ డిసెంబర్ లో క్రిస్మస్ సెలవులలో రావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా అన్ని సినిమాల డేట్స్ ‘సైరా’ కోసం మార్చుకోవలసిన పరిస్థితులలో మహేష్ చిరంజీవి నిర్ణయం బట్టి తన యాక్షన్ ప్లాన్ ను మార్చుకుంటాడా లేకుంటే మెగా స్టార్ తో స్నేహపూర్వకమైన పోటీకి మహేష్ సాహసం చేస్తాడా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..