ఆ చిత్రం టీజర్ ని మెచ్చుకున్నా మహేష్ బాబు..!!

ఆ చిత్రం టీజర్ ని మెచ్చుకున్నా మహేష్ బాబు..!!

0

టాలీవుడ్ లో ఓ సినిమా ని మరో సినిమా మెచ్చుకోవడం చాల అరుదుగా జరుగుతుంది.. ఆ సినిమా ఎంతో ఇంప్రెస్స్ చేస్తే కానీ వారు ఆ సినిమా బాగుంది అని ఒప్పుకోరు.. అలా ఒప్పుకున్నారు అంటే ఆ సినిమా మేటర్ ఉన్నట్లే.. అయితే ఎదుటి సినిమా బాగుందని చెప్పడంలో హీరో మహేష్ బాబు ఎప్పుడు ముందు ఉంటారు..

చిన్న సినిమా పెద్ద సినిమా ఏదైనా సరే మహేష్ బాబు కి నచ్చిందంటే చాలు ఆ సినిమా గురించి చెప్పేస్తారు.అయితే తాజాగా మహేష్ ఆవిరి చిత్రంపై స్పందించాడు. హారర్ కథాంశంతో చిత్రాలు తీయడంలో రవిబాబుది అందెవేసిన చేయి అని కితాబిచ్చాడు.

ఇలాంటి జానర్ లో వచ్చిన సినిమాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయని చెప్పాడు.ఈ చిత్రబృందానికి శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో విషెస్ తెలియజేశఆడు. దిల్ రాజు సమర్పణలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.