చంద్రబాబు సమావేశానికి కీలక నేతలు డుమ్మా

చంద్రబాబు సమావేశానికి కీలక నేతలు డుమ్మా

0

ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజకీయ వాస్తు సరిగ్గా లేదని తెలుస్తోంది… గత కొద్దికాలంగా ఆయన ఎలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా అట్టర్ ప్లాఫ్ అవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు…

తాజాగా 13 జిల్లాల వ్యాప్తంగా విస్తృతస్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు… ఈ సమావేశాలకు ముఖ్యనేతలు గైర్హాజరు అవుతుండటంతో అనేక అనుమానాలకు దారి తీస్తోంది… తాజాగా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయనకు ముఖ్యనేతలు ఝలక్ ఇచ్చారు…

కాకికాడ, రాజమండ్రి లోక్సభ స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్, మాగంటి రూప ఈరోజు సమావేశానికి హాజరుకాలేదు. అలాగే రామచంద్రపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీచేసిన తోట త్రిమూర్తులు కూడా ముఖం చాటేశారు. వీరు ముగ్గురు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.