మరో కీలక పదవి సీమ నేతలకు ఇస్తున్న చంద్రబాబు

మరో కీలక పదవి సీమ నేతలకు ఇస్తున్న చంద్రబాబు

0

తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు తెలుగు యువత అధ్యక్ష పదవి భర్తీ అనే పని ఉంది.. అయితే చంద్రబాబు మదిలో ఈ పదవి ఎవరికి ఇవ్వాలి అని ఆలోచన ఉంది.. ముఖ్యంగా ఈ పదవి కోసం రాయలసీమ నేతలు ఎక్కువ మంది చూస్తున్నారట.. ముఖ్యంగా అనంతపురం జిల్లా నుంచి జేసీ పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, ఈ పదవి కోసం చూస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి.. అంతేకాదు భూమా అఖిల ప్రియ పేరు కూడా ఈ పదవికి వినిపిస్తోంది, అలాగే అనంతపురం జిల్లా నుంచి పరిటాల రవి తనయుడు శ్రీరామ్ పేరు కూడా వినిపిస్తోంది.

అయితే ఇప్పటి వరకూ దేవినేని అవినాష్ ఆ పదవి చేపట్టారు.. ఇటీవల ఆయన రాజీనామా చేసి వైసీపీలో చేరారు.. అందుకే ఇప్పటి వరకూ కోస్తా వారికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఈపదవి ఇప్పుడు రాయలసీమ వారికి ఇవ్వాలని కోరుతున్నారట, అందుకే చంద్రబాబు కూడా వీరి నలుగురిలో ఒకరికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు, అయితే దీనికి వీరు సుముఖత వ్యక్తం చేస్తున్నారట. బాబు త్వరలోనే ఈ పదవి ని భర్తీ చేస్తారు అని తెలుస్తోంది. అయితే సీమలో ఈసారి ఎన్నికల్లో కేవలం ముగ్గురు మాత్రమే తెలుగుదేశం తరపున గెలిచారు. అందుకే ఇక్కడ పార్టీ కోసం ఈ నిర్ణయం తీసుకోవాలి అని సీనియర్లు చెబుతున్నారట.