మల్లాది విష్ణుకి జగన్ కీలక పదవి

మల్లాది విష్ణుకి జగన్ కీలక పదవి

0

మల్లాది విష్ణు వైసీపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ..అయితే తాజాగా ఆయనకు కీలక పదవి ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ..ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా మల్లాదిని నియమిస్తూ ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో విష్ణు రెండేళ్ల పాటు కొనసాగుతారు. ఇదిలా ఉంటే.. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ఆయనకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే టికెట్ను జగన్ కేటాయించారు.

అయితే పార్టీలో చేరిన సమయం నుంచి ఆయన జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు అంతేకాదు విష్ణుకు విజయవాడలో మంచి సర్కిల్ ఉంది ఆయన గెలుపుతో జగన్ కు తెలిసింది అయితే బ్రాహ్మణ కోటాలో ఆయనకు మంత్రి పదవి వస్తుంది అని అనుకున్నారు కాని ఆయనకు మిస్ అయింది తాజాగా కార్పొరేషన్ పదవిని ఇఛ్చారు జగన్

ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన బోండా ఉమా మహేశ్వరరావుపై మల్లాది గెలుపొందారు…విష్ణుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఆయన అభిమానులు, అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రేసులో బయట వారి పేర్లు వినిపించాయి కాని జగన్ మాత్రం దగ్గర నాయకులకి ఇచ్చారు అని తెలుస్తోంది.