మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు మార్కెట్లో కొత్త రేట్లు ఇవే

మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు మార్కెట్లో కొత్త రేట్లు ఇవే

0

బంగారం ధర మళ్లీ భారీగా పెరుగుతూ వస్తోంది, ఇప్పుడు మార్కెట్లో గడిచిన పది రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి ధర మార్కెట్లో నేడు పెరుగుదల నమోదు చేసింది, ఇక వెండి కూడా ఇలా పెరుగుదల కనిపించింది, అయితే హైదరాబాద్ లో అమ్మకాలు మళ్లీ పెరిగాయి, గడిచిన నెలలో భారీ అమ్మకాలే జరిగాయి, ఒకే రోజు 1600 తగ్గిన పసిడి మరి ఇప్పుడు రేటు ఎలా ఉందో చూద్దాం.

హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర పెరిగింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 పెరిగింది. రూ.52,050కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.260 పెరుగుదలతో రూ.47,710కు చేరింది
బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.290 పెరుగుదలతో వెండి ధర రూ.63,600కు చేరింది.

ఇక బంగారం ధర వచ్చే రోజుల్లో మరింత పెరుగుతుందా లేదా తగ్గుతుందా అంటే వచ్చే రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు, ముఖ్యంగా షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి ఇదే ప్రధాన కారణం అని తెలియచేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here