మా అధ్య‌క్షుడిగా మంచు విష్ణు నేడు ప్ర‌మాణ‌స్వీకారం

Manchu Vishnu is sworn in as our President today

0

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్షుడిగా మంచు విష్ణు ఇవాళ ప్ర‌మాణస్వీకారం చేయ‌నున్నారు. మంచు విష్ణు చేత మా ఎన్నిక‌ల అధికారి కృష్ణ మోహ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేయించ‌నున్నారు. విష్ణుతో పాటు ప్యానెల్ స‌భ్యులు కూడా ప్ర‌మాణం చేయ‌నున్నారు. ఫిల్మ్ న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్‌లో జ‌రిగే ఈ వేడుక‌కు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు.

ఈ నెల 10న మా జ‌రిగిన ఎన్నిక‌ల్లో మంచు విష్ణు ప్ర‌కాశ్ రాజ్‌పై 107 ఓట్ల తేడాతో గెలుపొందిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (‘మా’ )అధ్యక్షుడిగా మంచు విష్ణు 13వ తేదీన‌ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పెన్షన్ల ఫైలుపై తొలి సంతకం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here