మరో సినిమా స్టార్ట్ చేసిన రజనీకాంత్ దర్శకుడు ఎవరంటే

మరో సినిమా స్టార్ట్ చేసిన రజనీకాంత్ దర్శకుడు ఎవరంటే

0

సీనియర్ హీరోలు సినిమాల జోరు బాగానే పెంచుతున్నారు.. చిరంజీవి బాలయ్య సినిమాలు వరుసగా చేసుకుంటూనే ఉన్నారు.. ఇటు కోలీవుడ్ లో కమల్ హాసన్ కూడా తన సినిమాల జోరు పెంచారు.. అలాగే మరో సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా తాజాగా దర్బార్ సినిమాని చేశారు. అది ఇక చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

ఈ సమయంలో కాస్త రిలాక్స్ అయిన రజనీ తాజాగా మరో కొత్త సినిమా స్టార్ట్ చేశారు.
సన్ పిక్చర్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు..జనవరి మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమాని మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు..వరుసగా క్రేజీ హీరో అజిత్ తో సినిమాలు చేసిన ఈ దర్శకుడు, ఇప్పుడు రజనీకాంత్ ను మరింత మాస్ గా చూపించడానికి రెడీ అవుతున్నాడు. పల్లెటూరు బేస్ లో సినిమా ఉంటుంది. ఇది రజనీ కెరియర్ లో 168 వ సినిమా.. ఈ సినిమాలో కీర్తిసురేష్ రజనీకి హీరోయిన్ గా నటిస్తోంది