మరో ముగ్గురికి గాలం వేస్తున్న వైసీపీ

మరో ముగ్గురికి గాలం వేస్తున్న వైసీపీ

0

తెలుగుదేశం పార్టీ నుంచి మరొకొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి ..ముఖ్యంగా వైసీపీ నాయకులు కూడా అదే చర్చించుకుంటున్నారు.. అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయంలో కాస్త టెన్షన్ పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలకు గాలంవేసే ప్రయత్నాలను అధికార పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు ముమ్మరం చేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయం నడుపుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి జిల్లా నుంచి వీరు నలుగురు టీడీపీ తరపున విజయం సాధించారు కాని వీరు నలుగురిలో ముగ్గురికి వైసీపీ గాలం వేస్తోంది అని తెలుస్తోంది.

వీరు ముగ్గురు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారా అంటే ఆ వార్తలు ఇంకా రావడం లేదు.. కాని వైసీపీ తరపున గట్టి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అని తెలుస్తోంది. ముఖ్యంగా ఓ ఇద్దరు మంత్రలు వీరి రాకకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి డిసెంబర్ రెండో వారంలో మరికొందరు రాజీనామా బాట ఉంటుంది అని చెబుతున్నారు. బాబు మాత్రం జిల్లా నేతలో భేటీ అయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది.