మరో నలుగురు పవన్ కు షాక్

మరో నలుగురు పవన్ కు షాక్

0

పవన్ పార్టీలో దారుణమైన పరిస్దితి రాజకీయంగా కనిపిస్తోంది.. వరుస పెట్టి ఆరు నెలలుగా గుడ్ బై చెబుతున్న నేతలు పెరిగిపోతున్నారు. వరుసగా సీనియర్లని చూసుకుంటే ఆకుల సత్యానారాయణ.. రాఘవయ్య.. వెంకట్రామయ్య..రాజు రవితేజ.. ఇలా చెప్పుకొంటూ వెళ్తే- సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత జనసేన పార్టీ నుంచి వైదొలగిన నాయకులు జాబితా పెద్దదే అవుతుంది. పవన్ మాత్రం ఏం పట్టించుకోవడం లేదు ఉన్నా నేతలతోనే ముందుకు వెళుతున్నారు.

జనసేన సిద్ధాంతకర్తగా, మేనిఫెస్టో కమిటీ సారధిగా పేరు తెచ్చుకున్న రాజు రవితేజ.. పార్టీ నుంచి బయటికి వెళ్లడం.. అతి పెద్ద వార్తగా అందరూ భావిస్తున్నారు… జనసేన ఆవిర్భావం నుంచీ ఆయన పార్టీలో పనిచేస్తున్నారు. పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నాయకుడే ఇలా .. ఆయనపై విమర్శలు చేసి మరీ రాజీనామా చేయడం ఇక్కడ పెద్ద చర్చగా మారింది, అంతేకాదు ఆయన గురించి పలు కామెంట్లు చేశారు గతంలొ ఇలా వెళ్లి వచ్చినా మళ్లీ విమర్శలు చేయడం షాక్ అనే చెప్పాలి.

అయితే పార్టీలో మరో నలుగురు కీలక నేతలు కూడా గుడ్ బై చెబుతారు అని తెలుస్తోంది .. పవన్ నిర్ణయాలలో మార్పు అయినా రావాలి అంటున్నారు. మరి పవన్ ఇంకా నేతలని చేజార్చుకోకుండా చర్చిస్తే బెటర్ అంటున్నారు నేతలు