మరో రికార్డు క్రియేట్ చేయనున్న రజనీకాంత్

మరో రికార్డు క్రియేట్ చేయనున్న రజనీకాంత్

0

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తోంది అంటే అభిమానులు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తారు. వెండితెరపై రజనీకాంత్ సినిమాల్లో ఆయన స్టైల్ ఓ ఐకాన్ అనే చెప్పాలి. తాజాగా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ద‌ర్బార్ ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిపోయింది ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

వచ్చే ఏడాది 2020 సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.ఇక మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉంది, ఇక సినిమాకి ప్రమోషన్ కూడా అంతే బాగా చేస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ద‌ర్బార్‌` మోష‌న్ పోస్ట‌ర్‌ను నాలుగు బాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. దీని బట్టి సినిమాని నాలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారు అని తెలుస్తోంది

ఈ సినిమా పై ముందు నుంచి చాలా సస్పెన్స్ లు ఉన్నాయి, ఏ కీలక విషయం కూడా బయకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంది చిత్ర యూనిట్.. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ద‌ర్బార్ మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇక తెలుగు పోస్టర్ తమిళ పోస్టర్ కమల్ హసన్ విడుదల చేయనున్నారు, అలాగే మలయాళ పోస్టర్ మోహన్ లాల్, హిందీ పోస్టర్ సల్మాన్ ఖాన్ విడుదల చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు అన్నీ చోట్లా ఒకేసారి ఈ కార్యక్రమం చేయనుంది చిత్ర యూనిట్.