మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయను వైసీపీ ఎమ్మెల్యే

మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయను వైసీపీ ఎమ్మెల్యే

0

ఎమ్మెల్యే పోస్టు అంటేనే ఆ నియోజకవర్గంలో పెద్ద పదవి, రాష్ట్రంలో గుర్తింపు వచ్చే పదవి.. మరి ఆ పదవి ఒకసారి వస్తే జీవితాంతం ప్రజల మనసులో సుస్దిరంగా స్ధానం ఏర్పాటుచేసుకుని మళ్లీ గెలవాలి అని అనుకుంటారు ఎవరైనా.. కాని ఓ వైసీపీ ఎమ్మెల్యే మాత్రం దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన ఎవరో తెలుసుకుందామా.

నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకోసారి ఓట్లు అడుక్కోనని, ఎమ్మెల్యేగా పోటీ చేయనని ప్రకటించారు దీంతో అందరూ షాక్ అయ్యారు. కార్యకర్తలు వచ్చినా, రాకపోయినా… వాళ్ల కాళ్లు పట్టుకోనని ఆయన వ్యాఖ్యానించడం జిల్లాలోనే సంచలనం అయింది

ఊరికి పని కావాలంటే కార్యకర్తలే తన దగ్గరకు రావాలని, తాను ఏదో చెయ్యాలని ఎమ్మెల్యేను అయ్యానని.. ఏదో అయ్యిందని.. ఇక చాలని ఎమ్మెల్యే ఆర్థర్ నైరాశ్యంతో కూడిన వ్యాఖ్యలు చేశారు..ఇంటింటికీ తిరిగి ఓట్లడిగి గెలిపిస్తే… సమాచారం ఇవ్వకుండానే వస్తున్నారని కార్యకర్తలు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. అయితే అసలు జరిగింది ఏమిటి అని తెలుసుకుంటున్నారు జిల్లా వైసీపీ నేతలు. మరి నందికొట్కూరు వైసీపీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయా అనే చర్చ జరుగుతోంది.