మరో నందమూరి సీక్రెట్ చెప్పిన వంశీ

మరో నందమూరి సీక్రెట్ చెప్పిన వంశీ

0

తెలుగుదేశం పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వంశీ చేసే కామెంట్లు ఆరోపణలు తెలుగుదేశం పార్టీ నేతలకు వణుకు పుట్టిస్తున్నాయి.. ఇక చంద్రబాబు నారాలోకేష్ దేవినేని ఉమ రాజేంద్రప్రసాద్ ఇలా అందరిపై తీవ్రస్ధాయిలో ఆయన విమర్శలు చేశారు.. అంతేకాదు లోకష్ పార్టీని ముందుకు నడపలేడు, 2029లో పార్టీ ఉండదు అని ఆరోపణలు చేశారు.

మొత్తానికి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఉన్న పరిస్దితి మరింత దిగజారిపోతుంది అన్నారు.. 2009లో కేవలం ఎన్టీఆర్ ని తమ రాజకీయాల కోసం వాడుకున్నారు అని విమర్శలు చేశారు.. తర్వాత ఎన్టీఆర్ ని పక్కన పెట్టారు అని విమర్శించారు.. ఇక తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక్క దిక్కు ఎన్టీఆర్ అని ఆయన తెలియచేశారు.

ఇది పార్టీలో ఉన్న అందరూ అనుకునే మాట, లోకేష్ వల్ల కాదు అని బాబుకి కూడా తెలుసు అని బాంబ్ పేల్చారు ఆయన, ఇక జూనియర్ ఎన్టీఆర్ తప్ప మరెవరూ పార్టీని నడపలేరు అని తెలియచేశారు.