తమిళనాడులో వివాహ వేదికగా అమ్మ సమాధి

తమిళనాడులో వివాహ వేదికగా అమ్మ సమాధి

0

తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంటే రాష్ట్ర ప్రజలకు అమితమైన ప్రేమ. ప్రజలకు అమే అంటే ఎంత అభిమానమో చెప్పనవసరం లేదు. ఆమె కూడా అంతే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు ఎంతగానో చేరువయ్యింది. అందుకే తమిళనాట ప్రజలు జయలలితను అమ్మ అని పిలుచుకుంటారు. జయలలిత లోకాన్ని వీడి మూడేళ్లయినా ఇంకా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర గా మిగిలిపోయారు. అన్నా డీఎంకే అధినేత ఒకరు అమ్మ మీద ఉన్న ప్రేమ ను వినూత్నంగా చాటుకున్నారు.

ఏఐఏ డిఎంకె నేత భవాని శంకర్ కొడుకు ఎస్పీ సాంబశివ రామన్, దీపికల వివాహ మహోత్సవాన్ని అమ్మ సమాధి వద్ద తమిళనాడు సాంప్రదాయం ప్రకారం ఘనంగా నిర్వహించారు. జయలలిత సమాధి ఎదురుగా వధూవరులు ఒకటయ్యారు. ఈ సందర్భంగా భవాని శంకర్ మాట్లాడుతూ అమ్మ ఆశీస్సుల కోసమే తన కొడుకు వివాహం ఇక్కడ జరిపినట్లు తెలిపారు. ఈ వివాహానికి ఏ ఐఏ ఏం డికె నేతలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి సందర్భంగా జయలలిత సమాధి ని పూలతో అందంగా అలంకరించారు.