‘సాహో’కి పోటీగా ‘మయూరన్‌’

'సాహో'కి పోటీగా 'మయూరన్‌'

0

‘సాహో’ సినిమా కోసం అనేకమంది నిర్మాతలు తమ సినిమాలను వాయిదా వేసుకోవడమో, లేక ముందుగానే విడుదల చేయడమో చేస్తున్నారు. అలాంటిది ‘మయూరన్‌’ అనే తమిళ సినిమా ‘సాహో’కి పోటీగా వచ్చేందుకు సిద్ధమైంది.

కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌తో పీఎఫ్‌ఎస్‌ పినాకిల్‌ ఫిలిం స్టూడియో బ్యానర్‌పై కె.అశోక్‌కుమార్‌, పి.రామన్‌, జి.చంద్రశేఖరన్‌, ఎంపీ కార్తిక్‌ తదితరులు కలిసి నిర్మిస్తున్నారు.వేల రామ మూర్తి, ఆనంద్‌సామి, అముదవానన్‌, అస్మిత, కైలాష్‌, సాక్షి, బాలాజీ రాధాక ష్ణన్‌, రమేష్‌ కుమార్‌ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 30న విడుదల చేయబోతున్నారు.

ఈ చిత్రానికి పరమేశ్వర్‌ సినిమాటోగ్రఫి, జుబిన్‌ సంగీతం అందించగా, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించి దర్శకత్వం వహించారు నందన్‌ సుబ్బరాయన్‌.