మెగా సినిమాలో కోలీవుడ్ ప్రముఖ నటుడు

మెగా సినిమాలో కోలీవుడ్ ప్రముఖ నటుడు

0

మెగాస్టార్ చిరంజీవి తన సినిమాని జోరుగా పట్టాలెక్కిస్తున్నారు. అంతేకాదు 152 వ సినిమా గురించి ఏ అప్ డేట్ వస్తుందా అని అందరూ చూస్తున్నారు ..కొరటాల ఇప్పటికే సర్వం సిద్దం చేసుకున్నారు. ఇక ఈనెల 15 నుంచి షూటింగ్ కూడా ప్రారంభించనున్నారు అని తెలుస్తోంది
అయితే తాజాగా చిరు చెప్పిన విధంగా ఇందులో మార్పులు చేర్పులు చేశారట కొరటాల.

దాదాపు సంవత్సరం నుంచి కొరటాల ఈ కథపైనే ఫోకస్ చేశారు.. అంతేకాదు ఇందులో చిరు బాగా సన్నగా యంగ్ లుక్ లో కనిపిస్తారట. దీనికోసం కాస్త బరువు తగ్గుతారు అని తెలుస్తోంది. అయితే సినిమాలో మరికొందరు నటీనటులని తీసుకోనున్నారట అంతేకాదు కోలీవుడ్ ప్రముఖ నటుడ్ని ఇందులో ఆఫీసర్ గా తీసుకుంటారట.

అయితే ఎప్పుడూ కొరటాల సినిమాల్లో సస్పెన్స్ ఉంటుంది క్యారెక్టర్స్ అందరివి రీవిల్ చేయరు. తాజాగా మెగాస్టార్ 152 సినిమాలో కూడా ఇలాంటి విషయాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట కొరటాల.