మెగా అభిమానికి 10 లక్షలు చరణ్ మరో కీలక ప్రకటన

మెగా అభిమానికి 10 లక్షలు చరణ్ మరో కీలక ప్రకటన

0

మెగా కుటుంబం సాయం చేయడంలో ముందు ఉంటుంది అనేది తెలిసిందే.. చిరంజీవి నుంచి అభిమానుల విషయంలో మెగా కుటుంబం తమ సొంత వాళ్లలాగా అభిమానులని చూసుకుంటారు.
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో మారు తన పెద్దమనసు చాటుకున్నారు. నూర్ అహ్మద్ కుటుంబానికి 10లక్షల రూపాయల ఆర్థిక సాయం ఆయన ప్రకటించారు.

అవును గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ అహ్మద్ ఆకస్మిక మరణం చెందారు ఆయన మెగా కుటుంబానికి ఎంతో వీరాభిమాని అని అందరికి తెలిసిందే..చిరంజీవి, అల్లు అర్జున్ స్వయంగా ఆయన మృత దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఇక చరణ్ ఇక్కడ లేకపోవడంతో ఆయన రాలేకపోయారు.. కాని తాను హైదరాబాద్ రాగానే నూర్ అహ్మద్ కుటుంబాన్నికలుస్తానని చెప్పారు చరణ్ . అంతేకాదు ఆ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.ఆ కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మెగా ఫ్యామిలీ తోడు ఉంటుంది అని ఆయన తెలియచేశారు.