మెగాహీరోతో దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా

మెగాహీరోతో దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా

0

హిట్ వచ్చింది అంటే ఆ దర్శకుడి చుట్టూనే హీరోలు ఆలోచనలు ఉంటాయి.. క్రేజీస్టార్ డైరెక్టర్గుగా ముద్ర పడితే హీరోలు తమకు కథ సిద్దం చేయమని వారిని కోరతారు.. అయితే ఇప్పుడు మెగా హీరో ఓ కొత్త కధని చేయనున్నారట.. అయితే అది కూడా ఇఫ్పుడు దర్శకుడిగా తన ముద్ర చూపిస్తున వరుస హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో అని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్’తో బిజీగా ఉన్న మెగాపవర్స్టార్ రామ్చరణ్ తన తర్వాతి సినిమాపై ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు. అయితే చిరంజీవి-కొరటాల శివ సినిమాలో చరణ్ అతిథిగా కనిపించబోతున్నాడనే ప్రచారం ఉంది ..ఈ సినిమా తర్వాత ఆయన చేసే స్టోరీ పై ఎక్కడా క్లారిటీ రాలేదు, తాజాగా ఆయన నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ జూలై 30న విడుదలకు రెడీ అవుతోంది.

ఈ మూవీ షూటింగ్ నుంచి మార్చి లో ఫ్రీ అవ్వబోతున్నాడట చెర్రీ. దాంతో తన తర్వాతి సినిమాకోసం అనిల్ రావిపూడిని లైన్లో పెడుతున్నాడట. చరణ్ కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నాడట. అయితే చిరు కొరటాల సినిమాలో దాదాపు 40 రోజుల షెడ్యూల్ కూడా ఆయనది ఉండే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి .. అయితే ఆ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యేలోపుల ఈ సినిమా పట్టాలెక్కించడనున్నాడట అనిల్, సో టాలీవుడ్ లో ఈ టాక్ అయితే నడుస్తోంది.