మెగా మూవీ గురించి మెగా అప్ డేట్

మెగా మూవీ గురించి మెగా అప్ డేట్

0

మెగాస్టార్ చిరంజీవి త‌న త‌దుప‌రి సినిమాతో బిజీగా ఉన్నారు.. మొత్తానికి కొర‌టాల వ‌న్ ఇయ‌ర్ గ్యాప్ తో చిరు సినిమాని ప‌ట్టాలెక్కిస్తున్నారు, త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ప్రారంభం కానుంది మ‌రో మూడు రోజుల్లో అతి పెద్ద సెట్ వ‌ర్క్ ఫినిష్ అవ్వ‌బోతోంది, అక్క‌డ చిరుతో మెయిన్ సీన్స్ షూట్ చేయించ‌నున్నార‌ట‌.

ఈ సినిమా షూటింగ్ వీలైనంత వ‌ర‌కూ స్పీడుగా పూర్తి చేయాలి అని చూస్తున్నారు.. ఈ సినిమాని 2020లో స్వాతంత్య్ర దినోత్సవ స్పెషల్‌ గా ఆగస్టు 14న విడుద‌ల చేయాలని ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా సెట్స్ నుంచి ఏప్రిల్ కు పూర్తిగా ఫినిష్ చేయాలి.

ఎడిటింగ్ వ‌ర్క్ అంతా మూడు నెల‌ల్లో పూర్తి చేసి మిగిలిన 15 రోజులు చిత్రానికి ప్ర‌మోష‌న్స్ చేసుకోవ‌చ్చు అని చూస్తున్నారు ..అంతేకాదు త‌ర్వాత కొర‌టాల‌కు మ‌రో మూడు సినిమాలు రెడీగా ఉన‌్నాయి.. అందుకే ఆయ‌న ఈ సినిమాని వీలైనంత వేగంగా తీయాలి అని అనుకుంటున్నార‌ట‌..ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిషనే హీరోయిన్ గా తీసుకున్నారు.