మెగా స్టార్ చిరంజీవిపై జీవితా రాజశేఖర్ ఆగ్రహం

మెగా స్టార్ చిరంజీవిపై జీవితా రాజశేఖర్ ఆగ్రహం

0

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ లో తాజాగా మా డైరీ 2020 ఆవిష్కరణ జరిగింది… ఈ ఆవిష్కరణకు ముఖ్య అతిధులుగా చిరంజీవి అలాగే మోహన్ బాబు, కృష్ణంరాజులు హాజరు అయ్యారు… ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ మా అసోషియేషన్ సభ్యుల మధ్య విభేదాలతో ప్రభుత్వ సహాయ సహకారాలు ఆగిపోయాయని అన్నారు… ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు సర్దుకుపోవాలని అన్నారు….

దీనిపై నటుడు రాజశేఖర్ అభ్యంతరం వ్యక్తం చేశారు… అలాగే ఆయన భార్య జీవితా రాజశేఖర్ స్పందించారు… మా లో గొడవలు జరిగితే మా కంటే ముందే మీడియాలకే తెలుస్తుంది… ఇందులో దాచాల్సింది ఏదీ లేదు… ప్రతీ చోట గొడవలు ఉంటాయి మేము కూడా అందరిలా మనుషులమే అని అన్నారు…

మేము మీ ఇంట్లో కట్టేసిన కుక్కలమో బర్రెలమో కాదు అని అన్నారు… మాపై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చెయొద్దని అన్నారు జీవిత…