మిమ్మ‌ల్ని ఓన‌ర్లు ఇంటి అద్దెకి ఇబ్బంది పెడితే ఈ ప‌ని చేయండి

మిమ్మ‌ల్ని ఓన‌ర్లు ఇంటి అద్దెకి ఇబ్బంది పెడితే ఈ ప‌ని చేయండి

0

ఇప్పుడు దేశంలో లాక్ డౌన్ అమ‌లు అవుతోంది, ఈ స‌మ‌యంలో ఎవ‌రికి ఉపాధి లేదు, అందుకే ఇంటికి ప‌రిమితం అవ్వ‌డంతో రేష‌న్ న‌గ‌దు సాయం కూడా ప్ర‌భుత్వం తెల్ల‌రేష‌న్ కార్డ్ దారుల‌కి అందిస్తోంది, అయితే ఏ ప‌ని లేక‌పోవ‌డం ఉపాధి దూరం అవ‌డం ఉద్యోగాలు లేక‌పోవ‌డంతో జీతాలు రాని ప‌రిస్దితి

ఈ స‌మ‌యంలో ఇంటి కిరాయి కూడా చెల్లించే స్దితి లేదు , అందుకే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మార్చి ఏప్రిల్ మే నెల‌కు సంబంధించి మూడు నెల‌ల అద్దె ఇంటి ఓన‌ర్లు అడ‌గ‌వ‌ద్దు అని తెలిపారు, అంటే మొత్తం చెల్లించ‌కుండా కాదు, వారు మ‌ళ్లీ ఉపాధికి వెళ్లిన త‌ర్వాత కాస్త న‌గ‌దు వ‌చ్చిన త‌ర్వాత వాయిదాల ప్ర‌కారం ఇంటి అద్దె తీసుకోవ‌చ్చు.

ఈ మూడు నెల‌లు ఇంటి అద్దెకి ఇబ్బంది పెట్ట‌ద్దు అన్నారు, అయితే ఎవ‌రైనా ఇలా ఇబ్బంది పెడితే డ‌య‌ల్ 100 కి ఫోన్ చేస్తే పోలీసులు క‌చ్చితంగా మీకు సాయం చేస్తారు. ఇక ఎవ‌రైనా వ‌డ్డి ఆ అద్దెకి వేసినా నేరం, వారి గురించి కూడా ఫిర్యాదు చేయ‌వ‌చ్చు, ద‌య‌చేసి మాన‌వ‌తా దృక్ప‌దంతో ఆలోచించాలి అని ప్ర‌భుత్వం తెలిపింది ఇంటి య‌జ‌మానుల‌కి.