మధ్యాహం భోజనం పేరుతో రొట్టెలు, ఉప్పు

మధ్యాహం భోజనం పేరుతో రొట్టెలు, ఉప్పు

0

ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోని పాఠశాలల్లో చిన్నారులకు పోషకాహారం సరిగా అందట్లేదు. మధ్యాహన భోజనం పేరుతో కేవలం రొట్టెలు, కురకు బదులుగా ఉప్పు వేసి ఇస్తున్నారు.

సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు అందించే మధ్యాహం భోజనంలో అన్నాం, పప్పు, రొట్టె, కూరగాయలు, పండ్లు, పాలు వంటి పోషకాహారం ఇవ్వరని అధికారులు ఈ పథకం తీసుకొచ్చారు. ఐతే.. మిర్జాపూర్లోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మాత్రం ఇవేవి ఇవ్వకుండా కేవలం రొట్టెలు మాత్రమే పెడుతున్నారు. కనీసం కూర కూడా వండకుండా ఉప్పుతో తినమంటున్నారు.

ఒకరోజు ఉప్పు రోట్టెలు.. మరుసటి రోజు అన్నం,, ఉప్పు. ఇలా వారమంతా ఇదే భోజనం అందిస్తున్నారు. గత ఏడాది కాలంగా ఈ పాఠశాల ఇంచార్జి బాధ్యత రహితంగా ప్రవర్తించినట్లు తేలడంతో వారిని విధుల నుంచి సస్పెండ్ చేశామని అధికారులు వెల్లడించారు.