మిల్కీ బ్యూటీకి ఈ సారి అగ్ని పరీక్ష పెట్టిన దర్శకుడు

మిల్కీ బ్యూటీకి ఈ సారి అగ్ని పరీక్ష పెట్టిన దర్శకుడు

0

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించి 15 ఏళ్లు అవుతున్న హీరోయిన్ తమన్నా… ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మకు గ్లామర్ తగ్గలేదు… తన గ్లామర్ తో సినిమా అభిమానులను అలరిస్తూనే ఉంది… ప్రస్తుతం తమన్నా సిటిమార్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది…

గోపి చంద్ హీరోగా నటిస్తున్నాడు… సంపత్ నంది తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో గోపిచంద్ కబడ్డీ జట్ కెప్టెన్ గా వ్యవహరిస్తుంటే తమన్నా తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్ గా కనిపిస్తుందట.. ఈ సినిమాలో తమన్నా తెలంగాణ యాసలో మాట్లాడుతుందని అందరు చర్చించుకుంటున్నారు…

అంతేకాదు ఈ చిత్రం కోసం తమన్నా ప్రత్యేకంగా కబడ్డీ కూడా నేర్చుకుందట… మరి చూడాలి తెలంగాణ యాసలో అభిమానులను ఎలా మెప్పిస్తుందో మిల్కీ బ్యూటీ… సాయిపల్లవి ఫిదా చిత్రంలో తెలంగాణ యాసలో మాట్లాడి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే