మంత్రి అనిల్ షాక్

మంత్రి అనిల్ షాక్

0

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు భారీ షాక్ తగిలింది… శ్రీశైలం నుంచి తిరిగి కాన్వాయిలో వస్తుండగా నందికొట్కూరు వద్ద శ్రీశైలం ముంపు ప్రజలు ఆయన కాన్వాయిని అడ్డుకున్నారు..

తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రి అనిల్ కు వినతి పత్రాన్ని అందించారు… ఇక దీనిపై స్పందించిన అనిల్ వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు… దీంతో మంత్రి అనిల్ కాన్వాయిని శ్రీశైలం ముంపు ప్రజలు వదిలారు…

కాన్వాయిని అడ్డుకున్న సమయంలో పోలీసులకు అలాగే ప్రజల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది…. దీంతో మంత్రి అనీల్ తన కారు నుంచి దిగి నేరుగా వారి సమస్యలను విన్నారు… వారికి భరోసా ఇచ్చారు…