మంత్రి కేటీఆర్ కాన్వాయ్ పై చెప్పుతో దాడి..

0

రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రికేటీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా ఎలాంటి
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లావ్యాప్తంగా రైతుసంఘాల నాయకులతో పాటు
పలువురు ప్రజాప్రతినిధులను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేశారు. తాము ఎలాంటి తప్పుచేయకున్నా అన్యాయంగా అరెస్ట్ లు చేయడం కరెక్ట్ కాదని పలువురు రైతు సంఘాల నాయకులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా మంత్రి కేటీఆర్ మెట్టుపెల్లిలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో కాన్వాయ్ పై చెరుకు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు మామిడి నారాయణ రెడ్డి చెప్పును విసరడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ సంఘటనను గమనించిన పోలీసులు మామిడి నారాయణని అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ఘటన ప్రస్తుతం అంతట చర్చనీయ అంశంగా మారింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here