తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి..

0

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు  కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో తండోపతండాలుగా తరలివస్తున్నారు. దాంతో తిరుమల పరిసరప్రాంతాల్లో ఉండే కాంప్లెక్స్‌లు నిండిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు అన్నప్రసాదం, తాగు నీరు, చంటి పిల్లల కోసం పాలు ఇవ్వడం వంటి ఆర్థిక సహాయాలు చేస్తూ కొంత మేరకు ఆదుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కూడా వచ్చారు. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ దేవుడిని దర్శించుకున్న అనంతరం పండితులు వేదాశీర్వాదం, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశ ప్రజలకు భరోసా ఇవ్వలేని కాంగ్రెస్‌కు నాయకత్వం లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుల మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here