వైసీపీ ఎమ్మెల్యే రజనీకి అల్టిమేటమ్

వైసీపీ ఎమ్మెల్యే రజనీకి అల్టిమేటమ్

0

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విడుదల రజనీకి నియోజకవర్గానికి చెందిన ఒక దళితుడు భారీ హెచ్చరికలు పంపారు… తనకు ఎస్సీ కార్పోరేషన్ కింద మంజూరు అయిన కారును ఎమ్మెల్యే రజనీ రాకుండా చేశారని ఆయన ఆరోపించారు…

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…. వంకాయలపాడు చెందిన శ్యామేల్ అనే వ్యక్తి ఎస్సీకార్పోరేషన్ ద్వారా తనకు మంజూరు అయిన కారు ఎమ్మెల్యే రజనీ అధికారులకు ఫోన్ చేసి నిలిపివేసిందని ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు…

ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… తనకు ఈ నెల 15తేదీ లోపు పరిష్కారం చూపకపోతే జిల్లా కలెక్టర్ ఎదుట కుటుంబ సభ్యులతో ఆత్మహత్యా చేసుకుంటానని అల్టిమేటమ్ పంపాడు… మరి దీనిపై అధికారలు అలాగే ఎమ్మెల్యే రజనీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి….