మోదీ ప్రభుత్వం: జగన్ సర్కారు తీరు బాధాకరం..!!

మోదీ ప్రభుత్వం: జగన్ సర్కారు తీరు బాధాకరం..!!

0

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపేయాలని నవయుగ సంస్థకు రాష్ట్రప్రభుత్వం నోటీసులు జారీచేసిన మర్నాడే కేంద్ర సర్కారు ఈ పరిణామంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందంటూ ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ఒక కథనం రాసింది.

జగన్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బాధాకరమని కేంద్రం పేర్కొంది. దీనివల్ల పోలవరం ఎప్పటిలోగా పూర్తవుతుందో కూడా చెప్పలేమని విచారం వ్యక్తం చేసింది.

పోలవరం జాతీయ ప్రాజెక్టే అయినా నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వ హయాంలో వేగంగా సాగిన నిర్మాణ పనులు.. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నెమ్మదించాయి. అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తామని ప్రకటించింది. ఆ దిశగానే నవయుగకు 60 సీ నోటీసులు ఇచ్చింది. పనులు ఆపేయాలని ఆ సంస్థను ఆదేశించింది.

కాగా, జలాశయాల భద్రతపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరిగిన సమయంలో పోలవరం అంశాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రస్తావించారు. దీనికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ బదులిచ్చా రు.

”టెండర్లు రద్దు చేయడం వల్ల ఆ ప్రభావం ప్రాజెక్టు నిర్మాణంపై పడుతుందని కేంద్రమంత్రి ఆందోళన వ్య క్తం చేశారు. పోలవరం నిర్మాణ పనులను రాష్ట్రమే చూసుకుంటోందని.. నిర్మాణ పనుల్లో ఉన్న సంస్థ కాంట్రాక్టును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పడానికి విచారిస్తున్నానని అన్నారు. ఈ నిర్ణయం పోలవరం ప్రాజెక్టుకు మరో అవరోధంగా మారుతుందని.. దీనివల్ల ప్రాజెక్టు పూర్తికి ఎంత కాలం పడుతుందో చెప్పలేమని.. ఖర్చు భారీగా పెరుగుతుందని షెకావత్‌ అన్నారు” అని ఆ కథనంలో వివరించారు.