యాంక‌ర్ ప్ర‌దీప్ పై క్రిమిన‌ల్ కేసు పెట్టండి

యాంక‌ర్ ప్ర‌దీప్ పై క్రిమిన‌ల్ కేసు పెట్టండి

0
105

ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్లో ప్ర‌సార‌మ‌య్యే పెళ్లిచూపులు కార్య‌క్ర‌మం మొద‌లైన‌ప్ప‌టినుంచి వివాదాలు త‌లెత్తుతూనే ఉన్నాయి. గ‌తంలో ఈ కార్య‌క్ర‌మం ర‌ద్దు చేసి యాంక‌ర్ ప్ర‌దీప్ పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ప‌లుచోట్ల మ‌హిళ‌లు పోలీస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఇదేక్ర‌మంలో మ‌రో సారి క‌ర్నూల్ జిల్లా లోసుమ‌ ఛ‌న‌ల్ యాజ‌మాన్యంపై అలాగే యాంక‌ర్ ప్ర‌దీప్ పై చ‌ర్య‌లు తీసుకోవాలంటు జిల్లా క‌లెక్ట‌ర్ ఆఫీస్ ఎదుట మ‌హిళా సంఘాలు నిర‌స‌న‌లు తెలిపారు. పెళ్లి చూపులు కార్య‌క్ర‌మంలో మ‌హిళ‌ల‌ను అంగ‌డిలో ఉన్న సరుకులా చూపుతున్నార‌ని వారు మండిప‌తున్నారు