మూడు సినిమాలు ఒకే చేసిన తారక్ దర్శకులు వీరే

మూడు సినిమాలు ఒకే చేసిన తారక్ దర్శకులు వీరే

0

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్ చరణ్ ఒకరు కొమురం భీం పాత్రలో, మరొకరు అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు, వర్కింగ్ టైటిల్ ఆర్ ఆర్ ఆర్… అయితే ఈ సినిమా షూటింగ్ బాగానే జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా సెట్ప్ పై ఉండగానే మరో కొన్ని సినిమాలకు తారక్ ఫిక్స్ చేస్తున్నారట.

ఇక ఈ సినిమా పూర్తి అవ్వగానే ఓ నెట రెస్ట్ తీసుకుంటారట, తర్వాత ఓ కొత్త కథతో కొరటాల శివతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఎన్టీఆర్, ఇక కొద్ది నెలల క్రితం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తాను అని అన్నారు…సో ఇది కూడా పక్కా అని తెలుస్తోంది, ఇది మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు కథ సిద్దం చేస్తున్నాడు తారక్.

మొత్తానికి ఎన్టీఆర్ వచ్చే మూడు సంవత్సరాలు వరుసగా తన సినిమాలను ఫిక్స్ చేసుకుంటున్నాడు అని అంటున్నారు. అంతేకాదు వచ్చే మూడు సంవత్సరాలు ఈభారీ బడ్జెట్ చిత్రాలు పూర్తి అయిన తర్వాత కొత్త చిత్రాలు చేస్తారట అప్పటి వరకూ ఎలాంటి సైన్ చేయరట తారక్.