భారీ కండీషన్స్ తో బీజేపీలోకి ముద్రగడ

భారీ కండీషన్స్ తో బీజేపీలోకి ముద్రగడ

0

కాపునేత మాజీ ఎంపీ ముద్రగడ… ఈ పేరు ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరి చితం.. గతంలో కాపు రిజర్వేషన్ కోసం చంద్రబాబుకు మూడు చెరువుల నీళ్లు తాగించారు…. తమకు ఇచ్చిన హామీలతో పాటు అప్పుడప్పుడు టీడీపీ అవినీతిపై చంద్రబాబుపై నిప్పులు చెరుగుతూ ఘాటుగా లేఖలు రాసేవారు ఆయన.

ప్రస్తుతం కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారట. అదికూడా రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీజేపీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా టీడీపీ నేతలను బీజేపీలో చేర్చుకున్న అధిష్టానం వైసీపీ నేతలను కూడా టార్గెట్ చేస్తోంది. ఇక ఇదే క్రమంలో ముద్రగడను కూడా బీజేపీలో చేర్చుకోవలని చూస్తోందట. అయితే తాను పార్టీలో చేరాలంటే కాపు రిజర్వేషన్లపై కేంద్రం సానుకూలంగా స్పందించాలని అంటున్నారట.