మూడు రాజధానులపై క్లారిటీ అప్పుడే….

మూడు రాజధానులపై క్లారిటీ అప్పుడే....

0

మూడు రాజధానులపై మరో రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని తెలుగు అకాడమి చైర్మన్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు… ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి భావోద్వేగానికి గురి అయ్యారు…

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల అమరావతి రైతులకే నష్టం అని ఆమె అన్నారు… ఒక రాష్ట్రం అభివృద్ది చెందాలంటే ఏరియాను బట్టి ఆ ఏరియాలో ఏది పెడితే అభివృద్ది చెందుతుంది అనేదానిని పరిగణలోకి తీసుకున్నారని అన్నారు…

అమరావతిలో మూడు పంటలు పండే భూములు ఉన్నాయని అన్నారు… మూడు అడుగులు తవ్వితే నీరు వస్తుందని అన్నారు… ఇక్కడకు సంబందించిన డెవలప్ మెంట్ ఇక్కడ ఉంటుందని అలాగే కర్నూల్, విశాఖలో అక్కడి డెవలప్ మెంట్ అక్కడ ఉంటుందని అన్నారు..

చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ వందల ఎకరాలు అమరావతిలో భూములు కొన్నారు… కనుక ఆయన జోలె పడుతున్నారని అందులో భాగంగానే ఆయన భార్య భువనేశ్వరి కూడా గాజులు ఇచ్చి ఉంటారని అన్నారు లక్ష్మీ పార్వతి అన్నారు..