తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం

తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం

0

మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని ఓ గ్రామంలో దారుణ సంఘటన జరిగింది. తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. బాధిత బాలిక అమ్మమ్మతో కలిసి వినాయక ఊరేగింపు చూసేందుకు వెళ్ళింది.

ఆ తర్వాత బాలిక ను చూసిన పొరుగింటి వ్యక్తి పోగుల రాజు తాను ఇంటికి వెళ్తున్న బైక్పై వస్తావా అంటూ ఆమె ని అదిగాడు. బాలిక సరే అంది. అమ్మకు చెప్పి తన బైక్ ఎక్కింది. అనంతరం ఆమెను బైక్పై ఎక్కించుకున్న నిందితుడు ఆమెను ఇంటికి తీసుకెళ్లకుండా గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

విషయం తెలిసిన బాలిక అమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలికను చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.