మునగాకుతో ఎన్ని లాభాలో తెలుసా తప్పక తెలుసుకోండి

0

మునగ ఆకు కనిపించింది అంటే చాలు చాలా మంది తీసుకువెళ్లి పప్పు వండుతారు… అంతేకాదు ఇది శరీరానికి చాలా మంచిది అని పెద్దలు కూడా చెబుతారు, ఇక మునగ ఆకు కూర పప్పు వారానికి ఓసారి తినేవారు కూడా ఉంటారు
మునక్కాయలు ఆకు… ఇలా వీటి చెట్లు నుంచి వచ్చే ప్రతీ భాగం మన వారు బాగానే వాడుతారు… మన సౌత్ ఇండియాలో సాంబార్ చేస్తే అందులో మునక్కాయ ఉండాల్సిందే.

మునగకాయలు గురించి మనకు తెలుసు, మరి మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి.
ఇందులో మెండుగా కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ కూడా అందుతాయి, మెడిసన్స్ కు కూడా దీనిని వాడుతారు ఆయుర్వేద మందులకి దీనిని ఎక్కువగా వాడతారు, ఇక చాలా మంది ఊబకాయం కొవ్వు సమస్య ఉంటే మునగాకు వాడవచ్చు, చక్కర స్ధాయిలు తక్కువగా ఉంటాయి.

పెద్ద పేగులను కూడా శుభ్రం చేసి శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. ఇది వారానికి లేదా పదిరోజుకి తింటే కచ్చితంగా ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది, కాలేయ సమస్యలు రాకుండా చేస్తుంది.. మీకు ఈ విషయం తెలుసా నిమ్మ జాతి పండ్ల కంటే మునగాకులో విటమిన్ సి ఏడు రెట్లు అధికంగా ఉంటుంది. లేడీస్ కి గర్భాశయ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here