ఆ సినిమా కెరీర్ మార్చింది

ఆ సినిమా కెరీర్ మార్చింది

0

కేవలం సక్సెస్‌కు మాత్రమే ప్రాధాన్యతనిచ్చే చిత్ర పరిశ్రమలో అలాంటి వారికే రెడ్ కార్పేట్ స్వాగతం పలుకుతుంది. సినిమా అనేది ఫక్తు వ్యాపారం కాబట్టి ఇక్కడ గెలుపు గుర్రాలకే ఛాన్స్ ఉంటుంది. ఇటీవలే విడుదలై విజయం సాధించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అందులో హీరోయిన్లుగా నటించిన నిధి అగర్వాల్, నభానటేష జాతకం మారింది. చిత్ర దర్శకుడు పూరిపై కూడా ప్లాప్ ముద్రవీడింది.

ఇక హీరోయిన్ నభానటేష్ విషయానికి వస్తే అమెకు టాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తునాయి. ఇప్పటికే రవితేజతో డిస్కో రాజాలో నటిస్తోంది. ఇప్పుడు మరో ప్రాజెక్టు వచ్చినట్టు తెలిసింది.

మెగాకంపౌండ్ హీరో సాయిధరమ్ సరసన నటించనుందని సమాచారం. దీనికి దేవా కట్టా దర్శకత్వం వహిస్తారు. అధికారంగా ప్రకటించినప్పటికీ నబా నటించడం ఖాయం అని సన్నిహితులు అంటున్నారు.