జనసేన నుంచి కీలక నేతను వెళ్లగొట్టేందుకు ప్రయత్నం

జనసేన నుంచి కీలక నేతను వెళ్లగొట్టేందుకు ప్రయత్నం

0

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ వ్యాహారాలను అన్ని దగ్గరుండి చూసుకుంటారు… ఆయన తర్వాత రెండోస్తానంలో ఉన్న నేత మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్… ఈయన రాజకీయ మేధావి… గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ హయాంలో స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉంది…

ఆయన మీడియాముందు పెద్దగా కనిపించనప్పటికి తనపని తాను చేసుకుంటూ వెళ్తారు… అందుకే పవన్ నాదేండ్లకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు… పవన్ పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా నాదేండ్లకు తెలియకుండా తీసుకోరనే అభిప్రాయం ఉంది…

అలాంటి నేతను ఇప్పుడు పార్టీకి చెందిన కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు పవన్ లేనప్పుడు నాదేండ్ల మనోహర్ చెప్పినట్లు చేయాల్సి వస్తోందిని ఆగ్రహంతో ఉన్నారట.. ఈ క్రమంలో ఆయనకు పొగపెట్టేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి అయితే పవన్ మాత్రం వాటిని పట్టించుకోకున్నారు..