యూరేయం తవ్వకాలపై నాగబాబు స్పందన

యూరేయం తవ్వకాలపై నాగబాబు స్పందన

0

ప్రస్తుతం తెలంగాణలో యురేనియం తవ్వకాలు ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ సీని పరిశ్రమ మద్దతు పలుకుతోంది. దీనిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు నల్లమలలో యురేనియం తవ్వకాలు నిలిపివేయాలంటూ స్పందించారు. తాజాగా, మెగాబ్రదర్ నాగబాబు కూడా ఈ అంశంపై తన అభిప్రాయాలు వెల్లడించారు.

ప్రకృతిని కాపాడుకోవాలని, అడవుల్ని ధ్వంసం చేసి మైనింగ్ చేయడం అనేది సరికాదని హితవు పలికారు. ,నల్లమల అడవులను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు నిలిపివేయాలని అయన డిమాండ్ చేశారు. అంతేకాదు, change.org వెబ్ సైట్లో ఆన్ లైన్ పిటిషన్ కు సైనప్ చేయాలని పర్యావరణ ప్రేమికులకు నాగబాబు సూచించారు.