బాలీవుడ్ సూపర్ హిట్ రీమేక్ లో నాగ్..!!

బాలీవుడ్ సూపర్ హిట్ రీమేక్ లో నాగ్..!!

0

నాగ్ గత కొన్ని సినిమాలనుంచి తనకు తాజాగా కథలనే సినిమాలుగా చేస్తున్నాడు.. అప్పుడప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూనే మధ్య మధ్య తన ఏజ్ కి తగ్గ సినిమాలు చేస్తున్నాడు.. తాజగా ‘బిగ్ బాస్ సీజన్ 3″తో టైమ్ పాస్ చేస్తున్న నాగార్జున.. ఇప్పుడు ఆ షో చివరి దశకు చేరుకోవడంతో ఆ షో కంప్లీట్ అయ్యేలోపు తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.

అయితే బంగార్రాజు సినిమా చేయాలి కానీ ఎందుకో ఆ సినిమా పట్టాలెక్కలేదు.. అయితే ఈ సినిమా ప్లేస్ లో బాలీవుడ్ లో విడుదలై మంచి విజయం సొంతం చేసుకొన్న ‘రైడ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలోపడ్డాడట నాగ్. హిందీలో అజయ్ దేవగన్, ఇలియానా జంటగా రూపొందిన ఆ చిత్రం మంచి కలెక్షన్స్ తోపాటు.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొంది.

అయితే హిందీలో సౌరభ్ శుక్లా పోషించిన పాత్రను తెలుగులో ఒక సీనియర్ ఫీమేల్ లీడ్ తో చేయించాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఇది ఎప్పటికీ వర్కవుట్ అవుతుందో, అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.