నో ఇది ఆ మూవీ సీక్వెల్ కాదు : నాగార్జున

నో ఇది ఆ మూవీ సీక్వెల్ కాదు : నాగార్జున

0

రాహూల్ రవీంద్ర దర్శకత్వంలో నాగార్జున,రకూల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ కాంబినేషన్ లో ‘మన్మథుడు 2 ‘ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాండ్ వస్తుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున కొన్ని విషయాలు మీడియాతో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మన్మథుడు మూవీకి ఇది సీక్వెలా అని అడిగిన ప్రశ్నకు..నో ఈ సినిమాకు ఎలాంటి సంబంధమూ లేదని తాజాగా జరిగిన `మన్మథుడు-2` ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో నాగార్జున చెప్పారు. `గతంలో వచ్చిన `మన్మథుడు` సినిమాకు ఇది సీక్వెల్ కాదు. దాని కథకు, దీనికి ఎలాంటి సంబంధమూ లేదు.

ఈ మూవీ కూడా లవ్, ఎమోషన్, కామెడీ జోనర్ లో సాగుతుందని..గతంలో మన్మథుడు తన సినిమానే కనుక ఆ పేరు పెట్టామని అన్నారు. ఇది ఒక ఫ్రెంచ్ సినిమాకు రీమేక్‌. ఆ సినిమా హక్కులు తీసుకుని ఈ సినిమాను రూపొందించామ`ని నాగార్జున తెలిపారు. ఇదే సందర్భంగా బిగ్ బాస్ పై స్పందించిన నాగ్ తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడుతుందని అన్నారు.