హాట్ టాపిక్ కి తెరతీసిన నాగార్జున

హాట్ టాపిక్ కి తెరతీసిన నాగార్జున

0

నాగార్జున నటించిన ‘మన్మథుడు 2’ ఈ నెల 9వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఆ వేడుకకి సంబంధించిన వేదికపై, గతంలో వచ్చిన ‘మన్మథుడు’ సినిమాను గురించి నాగ్ ప్రస్తావించారు. ఆ సినిమా దర్శకుడైన విజయ్ భాస్కర్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఎంతగానో పొగిడారు. ఆ సినిమా ఆ స్థాయి విజయాన్ని సాధించడానికి ముఖ్య కారకుడైన ఆ చిత్ర రచయిత త్రివిక్రమ్ ను గురించి నాగ్ ప్రస్తావించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

తాజా ఇంటర్వ్యూలో నాగ్ కి ఇదే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. నాకు ‘మన్మథుడు’ కథ చెప్పింది .. ఆ కథ గురించి చర్చించింది .. పంచ్ డైలాగ్స్ చెప్పించింది విజయ్ భాస్కర్ గారే. అందుకే ఆయన గురించే మాట్లాడాను .. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్’ అనేశారు. దాంతో నాగ్ – త్రివిక్రమ్ మధ్య మనస్పర్థలు ఉన్నాయనీ, అవి ఇప్పుడు ఇలా బయటపడ్డాయంటూ అంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.