’83’ సినిమాను రిలీజ్ చేయనున్న నాగార్జున..!!

'83' సినిమాను రిలీజ్ చేయనున్న నాగార్జున..!!

0

కొత్త‌దాన్ని ప్రోత్స‌హించ‌డంలో ఎప్పుడూ ముందుండే నాగార్జున తాజాగా కొత్త అడుగు వేస్తున్నారు. త‌మ సొంత నిర్మాణ సంస్థ‌పై ఇత‌ర సంస్థ‌ల చిత్రాల్ని రిలీజ్ చేయ‌ని నాగ్ తాజాగా ఓ బాలీవుడ్ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల కోసం రిలీజ్ చేయ‌బోతున్నారు.

బాలీవుడ్ మూవీ 83 తెలుగు వర్షన్‌ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై అక్కినేని నాగార్జున తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇండియ‌న్ క్రికెట్ చ‌రిత్ర‌లో 1983 వ‌ర‌ల్డ్ క‌ప్‌ సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌బడింది. దేశమంతా గర్వించేలా ప్రపంచ కప్ సాధించి భారతదేశ కీర్తి పతాకాన్ని ఎల్లలు దాటించారు అప్పటి క్రికెట్ జట్టు కెప్టెన్ కపిల్ దేవ్. ఈయన నాయ‌క‌త్వంలో ఇండియా చిరకాల స్వప్నం సాకారమైంది. అయితే ఈ అపూర్వ ఘ‌ట్టాన్ని వెండితెర‌పై ఆవిష్క‌రిస్తూ 83 పేరుతో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టారు బాలీవుడ్ డైరెక్టర్ క‌బీర్‌ఖాన్.

ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు బిజినెస్ ప్రారంభించేశారు. తెలుగులో ఈ చిత్ర రిలీజ్ కు సంబంధించి కింగ్ నాగార్జున ఆసక్తికరమైన ప్రకటన చేశారు. తెలుగులో తాను ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలిపారు.