నాకు జగన్ బాగా తెలుసు కోట్లిస్తే కేసు కొట్టించేస్తా… రాయపాటికి ఫోన్ కాల్

నాకు జగన్ బాగా తెలుసు కోట్లిస్తే కేసు కొట్టించేస్తా... రాయపాటికి ఫోన్ కాల్

0

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడాడు… తాను సీబీఐలో పని చేస్తున్నానని తనకు సీబీఐ డైరెక్టర్ బాగా సన్నిహితుడని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తనకు బాగా తెలుసని ఆ వ్యక్తి రాయపాటికి ఫోన్ లో చెప్పాడు…

తనకు డబ్బులు ఇస్తే కేసులు కొట్టించేస్తానని చెప్పాడు… ఇక అనుమానం వచ్చిన రాయపాటి సీబీఐ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.. దీంతో వారు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది… కాగా ఇటీవలే సాంబశివరావు ఇంట్లో సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే…

ఆయనకు సంబంధించిన ట్రాన్స్ ట్రయ్ కంపెనీలపై తనిఖీలు నిర్వహించారు.. సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రయ్ కంపెనీ 300 కోట్లు మేర బ్యాంకు రుణాలు తీసుకుంది…

అయితే వాటిని తిరిగి చెల్లించకుండా ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు… ఈ క్రమంలోనే ఆయనపై120 బి రెడ్ విత్ 420 406 468 477 ఏ పీసీఈ యాక్ట్ 13(2) రెడ్ విత్ 13 (1) డి సెక్షన్ల కింద కేసునమోదు చేశారు అధికారులు…