నాకు జగన్ మూడు ఛాన్స్ లు ఇచ్చారు పోసాని సంచలన వ్యాఖ్యలు

నాకు జగన్ మూడు ఛాన్స్ లు ఇచ్చారు పోసాని సంచలన వ్యాఖ్యలు

0

ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఏం చెప్పినా క్రిస్టర్ క్లియర్ గా ఉంటుంది ..ఆయన నచ్చితే ఎస్ అంటారు, నచ్చకపోతే నచ్చలేదు అని ముఖం పై చెబుతారు.. రాజకీయాల్లో ఇలాంటి పద్దతి కాస్త ఇబ్బందికరం అయినా ఆయన మాత్రం అలాంటివి పట్టించుకోరు.. పదవులు అంటే తనకు వ్యామోహం కూడా లేదు అంటారు.. సినిమాల్లో మాత్రం ఆయనకు అవకాశాలు అలాగే వస్తూ ఉంటాయి.

తాజాగా వైఎస్ జగన్ అంటే తనకు అభిమానం అని ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తెలిపారు. ఆయన జగన్ గురించి కొన్ని ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. సీఎం జగన్ తన క్యాబినెట్ లో నాలాంటి వ్యక్తి ఒకడుండాలని భావించారు. నాకు మూడు సార్లు అవకాశం ఇచ్చారు. ఆసక్తి లేదని చెప్పాను. అయినాగానీ ఓ ప్రతినిధిని పంపించారు. గంట పాటు చర్చలు కూడా జరిగాయి. అప్పటికీ నేను ఒప్పుకోలేదు. జగన్ నాతో జీవితకాలం ప్రేమగా మాట్లాడితే చాలుఅని వెల్లడించారు పోసాని.

అయితే పోసాని ముందు నుంచి జగన్ నుంచి ఏమీ ఆశించలేదు, అందుకే సీఎం జగన్ కూడా ఏరి కోరి మరీ ఆయనకు పదవులు ఇస్తాను అంటున్నారు.. కాని ఆయన మాత్రం వాటిని తిరస్కరిస్తున్నారు.. ఆయనకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే రాజ్యసభ సీటు ఇస్తాము అని కూడా గతంలో చెప్పారట కాని మురళి మాత్రం అన్నింటికి నో చెప్పారు.